చెట్టును నరికివేతో కరువుగా మారుతున్నా షోచమైన గాలి .
అనుమతి లేకుండా ఒక్క చెట్టును కూడా నరకకూడదు. చెట్టును నరకాలంటే దానికి అధికారుల అనుమతి తీసుకోవాలి. తొలగించిన చెట్టుకు బదులుగా మరో చెట్టు వేయాలి. నీటి వనరుల నాశనం కాకుండా వాటి సంరక్షణకు నిర్మాణాలు చేపట్టాలి. మండల స్థాయిలో కమిటీలు నెలకోసారి సమావేశమై చట్టం అమలును పర్యవేక్షించాలి. ఇవీ స్థూలంగా ఎపి వాల్టా చట్టం (ఆంధ్రప్రదేశ్ వాటర్, ల్యాండ్, ట్రీస్ యాక్ట్-2004) నిబంధనలు. కానీ, చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం నల్లాపల్లి సర్వే నెంబర్ 268/2 విషయంలో రెవెన్యూ అధికారులు చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరించారు.
నల్లాపల్లి సర్వే నెంబర్268/2 లో 75 సెంట్లు భూమి సదర గ్రామంకి చెందిన ఎర్రి సుబ్రమణ్యం రెడ్డి (బాబురెడ్డి సుబ్బారెడ్డి) పేరునా వెబ్ ల్యాండ్ ఖాతా నెంబర్ 75, నమోదైంది. శనివారం ఉదయం నా పొలంలో 20 చెట్లు మా గ్రామనికి చెందిన ఎర్రి సుబ్రమణ్యం రెడ్డి(కరిబ్బ) నరికివేసినడు అని రెవిన్యూ అధికారులు విన్నవించుకున్నాడు. కాని రెవెన్యూ అధికారులు ఎవరుకుడా అటువైపు చూడలేదు.
సుబ్బారెడ్డి ఫోన్లో ద్వార అటవీశాఖ అధికారులుకు విన్నవించుకున్నాడు, విషయం తెలిసిన వెంటనే అటవీశాఖ అధికారులు సదరు గ్రామానికి చేరుకుని సుబ్బారెడ్డి పొలంలో చెట్లు నరికివేసిన ఎర్రి సుబ్రమణ్యం రెడ్డి(కరిబ్బ)ను విచారణ చేపట్టారు. అటవీశాఖ అధికారులు నరికివేసిన ,చెట్లును ఏవరు తీసుకవేళకుడు అన్ని ఎర్రి సుబ్రమణ్యం రెడ్డి(కరిబ్బ) మరియు గ్రామంలో ప్రజలకు, ఎర్రి సుబ్రమణ్యం రెడ్డి(కరిబ్బ) వాల్టా చట్టం-2004 (ఆంధ్రప్రదేశ్ వాటర్, ల్యాండ్, ట్రీస్ యాక్ట్) నిబంధనలకు విరుద్ధంగా నరికివేసినడు కావున మా పై అధికారులు చెబుతున్నాను మా పై అధికారులు నిర్ణయం తీసుకోవాలి అన్ని చెప్పి వెళ్లిపోయారు. కానీ ఎర్రి సుబ్రమణ్యం రెడ్డి(కరిబ్బ) ఆరోజు రాత్రి రెవిన్యూ అధికారులు కుమ్మక్కై నరికిన చెట్లను గుట్టుచప్పుడు కాకుండా తీసుకుని వెలిపోయినడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించలేదు.
అధికారులు వాల్టా చట్టానికి నిలువునా తూట్లు పొడిచేలా వ్యవహరించారు. ఇష్టానుసారంగా చెట్లులను ధ్వంసం చేస్తున్నారు. వాల్టా చట్టం-2004 (ఆంధ్రప్రదేశ్ వాటర్, ల్యాండ్, ట్రీస్ యాక్ట్) ప్రకారం ఒక చెట్టు నరికితే రెండు రెట్ల విలువ గల అపరాధ రుసుమును విధించాలి. అపరాధ రుసుమును ఐదు రెట్ల వరకు విధించే అవకాశముంది. వాణిజ్య, నివాస, పారిశ్రామిక అవసరాల కోసం చెట్లను పడగొడితే అదే ప్రాంతం లేదా అనువైన ప్రాంతంలో నెల రోజుల్లోగా ఒక చెట్టు బదులుగా మరో మొక్కను నాటాల్సి ఉంటుందని నిబంధనలు చెప్తున్నాయి. శ్రీరంగరాజపురం మండలంలో చెట్లులను ధ్వంసం చేస్తూ చట్టాన్ని అపహాస్యం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
అటకెక్కిన వాల్టా చట్టం.
ఎపి వాల్టా 2004 చట్టంలోని రూల్ నంబరు 24 ప్రకారం చెట్లు తొలగించాలంటే, మండల స్థాయిలో అయితే తహశీల్దార్‌కు దరఖాస్తు చేయాలి. ఏ ప్రాంతంలో చెట్లను తొలగిస్తున్నారో పేర్కొనాలి. నివాస, వాణిజ్య ప్రాంతాలు, వ్యవసాయం, పారిశ్రామిక ప్రాంతం పేర్లను స్పష్టం రాయాలి. ఆయా ప్రాంతాల్లో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని పడగొడుతున్నారు, ఏయే వృక్ష జాతులు ఉన్నాయనేది దరఖాస్తులో పొందుపరచాలి. చెట్లను పడగొట్టడానికి గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలి. నల్లాపల్లి విషయంలో సుబ్రమణ్యం రెడ్డి(కరిబ్బ) దరఖాస్తు చేయలేదు, అధికారులు వాటి జోలికే పోలేదు.
No comments:
Post a Comment