రాయలసీమ ఆత్మగౌరవ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాలుగోన్నారు
ఈ సభలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ బీళ్లుగా మారిపోయిన నా రాయలసీమ రైతన్న సోదరులకు, 85 సంవత్సరాలుగా త్యాగం తప్ప భోగం తెలియని నష్టాలకు పూర్తిగా అలవాటైపోయిన నా సీమ పౌరులకి అందరిలో ఒకనిగా మీకోసమని పాటుపడేటువంటి ఒక కార్యకర్తగా వినమ్రంగా ప్రార్థిస్తున్నా అంటూ మొదలు పెట్టిన భూమన ప్రసంగం మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు మన ప్రియతమా ముఖ్యమంత్రి ప్రతిపాదన చేస్తే చంద్రబాబు నాయుడు ఆయనని సమర్ధించే రాయలసీమ ద్రోహులంతా చేరి రాయల సీఎంగా వాసులు మూడు రాజధానులు వ్యతిరేకం అని నిస్సిగ్గుగా అసత్య ప్రచారం చేస్తున్న ప్రచారానికి వ్యతిరేకంగా ఈరోజు ఒక్క తిరుపతి నగరంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు జయజయ ద్వానాలతో మూడు రాజధానులకి మద్దతుగా రాయలసీమలో న్యాయ రాజధానికి మద్దతుగా వచ్చి చంద్రబాబు గుండెల్లో దాదా పుట్టించారు అన్నారు. జగన్మోహన్రెడ్డి గారు దమ్మున్న వాడు కనుకనే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తా అంటున్నాడు దమ్మున్న వాడు కనుకనే న్యాయ రాజధాని రాయలసీమలో పెడతా అంటున్నాడు. ప్రతి రోజూ నీ పచ్చ పత్రికల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసిన కరువు ప్రాంత ఆక్రందనలని అర్ధం చేసుకొన్న వ్యక్తిగా రాష్ట్ర అభివృద్దే ద్వేయంగా ముందుకెళ్తున్నాడు అన్నారు.
ఆత్మగౌరవసభకు విచ్చేసిన రాయలసీమ ప్రజలుఅనంతరం తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రసంగిస్తూ రాయలసీమ వాసుల మనోభావాలను గౌరవిస్తూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధాని రాయలసీమకు ప్రకటిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఒక ప్రాంతంలోనే 29 గ్రామాల పరిధిలో అభివృద్ధి మొత్తం కేంద్రీకరించాలని, లక్షల కోట్ల రూపాయలు నిధులు అక్కడే ఖర్చు చేసి వారి అనుయాయుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కొమ్ము కాసే విధంగా రాయలసీమలోనే పుట్టి పెరిగిన చంద్రబాబు నాయుడు వ్యవహరించడం కడు శోచనీయమని ఎంపీ గురుమూర్తి అన్నారు. దుష్టచతుష్టయం సహకారంతో రాష్ట్ర ప్రజల మెదళ్లలో విష బీజాలు నాటుతున్న చంద్రబాబుకి ఆయన కోటరీకి తిరుపతి ఆత్మగౌరవ మహాప్రదర్శన ఒక చెంపపెట్టు అని ఈ నాటి సభ ద్వారా తెలిసి వచ్చిందని చెప్పారు. రాయలసీమ ఇప్పటివరకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ కరువులతో కడుపు మాడ్చుకొన్నాం, మన బిడ్డలకు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూసాం నేడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సీమ అభివృద్ధికి బాటలు పడ్డాయి, మన బిడ్డలకి ఉద్యోగ కల్పన కోసం రాయలసీమ అభివృద్ధి కోసం ఎన్నో కంపెనీలు నెలకొల్పుతున్నారు. ఆ కోవలోనే తిరుపతికి ఐటీ కాన్సెప్ట్ సిటీ కూడా మంజూరు అయిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి మద్దతుగా పెద్దఎత్తున తరలి వచ్చిన అశేష జనవాహినికి పాదాభి వందనం అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
No comments:
Post a Comment