Sunday, March 5, 2023

వాల్టా... ఉల్టా



 చెట్టును నరికివేతో కరువుగా మారుతున్నా షోచమైన గాలి .
అనుమతి లేకుండా ఒక్క చెట్టును కూడా నరకకూడదు. చెట్టును నరకాలంటే దానికి అధికారుల అనుమతి తీసుకోవాలి. తొలగించిన చెట్టుకు బదులుగా మరో చెట్టు వేయాలి. నీటి వనరుల నాశనం కాకుండా వాటి సంరక్షణకు నిర్మాణాలు చేపట్టాలి. మండల స్థాయిలో కమిటీలు నెలకోసారి సమావేశమై చట్టం అమలును పర్యవేక్షించాలి. ఇవీ స్థూలంగా ఎపి వాల్టా చట్టం (ఆంధ్రప్రదేశ్‌ వాటర్‌, ల్యాండ్‌, ట్రీస్‌ యాక్ట్‌-2004) నిబంధనలు. కానీ, చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం నల్లాపల్లి సర్వే నెంబర్ 268/2 విషయంలో రెవెన్యూ అధికారులు చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరించారు. 
నల్లాపల్లి సర్వే నెంబర్268/2 లో 75 సెంట్లు భూమి సదర గ్రామంకి చెందిన ఎర్రి సుబ్రమణ్యం రెడ్డి (బాబురెడ్డి సుబ్బారెడ్డి) పేరునా వెబ్ ల్యాండ్ ఖాతా నెంబర్ 75, నమోదైంది. శనివారం ఉదయం నా పొలంలో  20 చెట్లు మా గ్రామనికి చెందిన ఎర్రి సుబ్రమణ్యం రెడ్డి(కరిబ్బ) నరికివేసినడు అని రెవిన్యూ అధికారులు విన్నవించుకున్నాడు. కాని రెవెన్యూ అధికారులు ఎవరుకుడా అటువైపు చూడలేదు.
సుబ్బారెడ్డి ఫోన్లో ద్వార అటవీశాఖ అధికారులుకు విన్నవించుకున్నాడు, విషయం తెలిసిన వెంటనే అటవీశాఖ అధికారులు సదరు గ్రామానికి చేరుకుని సుబ్బారెడ్డి పొలంలో చెట్లు నరికివేసిన ఎర్రి సుబ్రమణ్యం రెడ్డి(కరిబ్బ)ను విచారణ చేపట్టారు. అటవీశాఖ అధికారులు నరికివేసిన ,చెట్లును ఏవరు తీసుకవేళకుడు అన్ని  ఎర్రి సుబ్రమణ్యం రెడ్డి(కరిబ్బ) మరియు గ్రామంలో ప్రజలకు, ఎర్రి సుబ్రమణ్యం రెడ్డి(కరిబ్బ) వాల్టా చట్టం-2004 (ఆంధ్రప్రదేశ్‌ వాటర్‌, ల్యాండ్‌, ట్రీస్‌ యాక్ట్‌)  నిబంధనలకు విరుద్ధంగా నరికివేసినడు కావున మా పై అధికారులు చెబుతున్నాను మా పై అధికారులు నిర్ణయం తీసుకోవాలి అన్ని చెప్పి వెళ్లిపోయారు. కానీ ఎర్రి సుబ్రమణ్యం రెడ్డి(కరిబ్బ) ఆరోజు రాత్రి రెవిన్యూ అధికారులు కుమ్మక్కై నరికిన చెట్లను గుట్టుచప్పుడు కాకుండా తీసుకుని వెలిపోయినడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించలేదు.
   అధికారులు వాల్టా చట్టానికి నిలువునా తూట్లు పొడిచేలా వ్యవహరించారు.  ఇష్టానుసారంగా చెట్లులను ధ్వంసం చేస్తున్నారు. వాల్టా చట్టం-2004 (ఆంధ్రప్రదేశ్‌ వాటర్‌, ల్యాండ్‌, ట్రీస్‌ యాక్ట్‌) ప్రకారం ఒక చెట్టు నరికితే రెండు రెట్ల విలువ గల అపరాధ రుసుమును విధించాలి. అపరాధ రుసుమును ఐదు రెట్ల వరకు విధించే అవకాశముంది. వాణిజ్య, నివాస, పారిశ్రామిక అవసరాల కోసం చెట్లను పడగొడితే అదే ప్రాంతం లేదా అనువైన ప్రాంతంలో నెల రోజుల్లోగా ఒక చెట్టు బదులుగా మరో మొక్కను నాటాల్సి ఉంటుందని నిబంధనలు చెప్తున్నాయి. శ్రీరంగరాజపురం మండలంలో చెట్లులను ధ్వంసం చేస్తూ చట్టాన్ని అపహాస్యం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
 అటకెక్కిన వాల్టా చట్టం.
ఎపి వాల్టా 2004 చట్టంలోని రూల్‌ నంబరు 24 ప్రకారం చెట్లు తొలగించాలంటే, మండల స్థాయిలో అయితే తహశీల్దార్‌కు దరఖాస్తు చేయాలి. ఏ ప్రాంతంలో చెట్లను తొలగిస్తున్నారో పేర్కొనాలి. నివాస, వాణిజ్య ప్రాంతాలు, వ్యవసాయం, పారిశ్రామిక ప్రాంతం పేర్లను స్పష్టం రాయాలి. ఆయా ప్రాంతాల్లో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని పడగొడుతున్నారు, ఏయే వృక్ష జాతులు ఉన్నాయనేది దరఖాస్తులో పొందుపరచాలి. చెట్లను పడగొట్టడానికి గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలి. నల్లాపల్లి  విషయంలో  సుబ్రమణ్యం రెడ్డి(కరిబ్బ) దరఖాస్తు చేయలేదు, అధికారులు వాటి జోలికే పోలేదు.

Saturday, October 29, 2022

బాబు నీ కుట్రలకు ...బయ్ బాయ్

                తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ సభకు  తరలివసుతున్నా మహిళలు 


              రాయలసీమ  ఆత్మగౌరవ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాలుగోన్నారు 



ఈ సభలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ  బీళ్లుగా మారిపోయిన నా రాయలసీమ రైతన్న సోదరులకు, 85  సంవత్సరాలుగా త్యాగం తప్ప భోగం తెలియని నష్టాలకు పూర్తిగా అలవాటైపోయిన నా సీమ పౌరులకి అందరిలో ఒకనిగా మీకోసమని పాటుపడేటువంటి ఒక కార్యకర్తగా వినమ్రంగా ప్రార్థిస్తున్నా అంటూ మొదలు పెట్టిన భూమన ప్రసంగం మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు మన ప్రియతమా ముఖ్యమంత్రి ప్రతిపాదన చేస్తే చంద్రబాబు నాయుడు ఆయనని సమర్ధించే  రాయలసీమ ద్రోహులంతా చేరి రాయల సీఎంగా వాసులు మూడు రాజధానులు వ్యతిరేకం అని నిస్సిగ్గుగా అసత్య  ప్రచారం చేస్తున్న ప్రచారానికి వ్యతిరేకంగా ఈరోజు ఒక్క తిరుపతి నగరంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు జయజయ ద్వానాలతో మూడు రాజధానులకి మద్దతుగా రాయలసీమలో న్యాయ రాజధానికి మద్దతుగా వచ్చి చంద్రబాబు గుండెల్లో దాదా పుట్టించారు అన్నారు. జగన్మోహన్రెడ్డి గారు దమ్మున్న వాడు కనుకనే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తా అంటున్నాడు దమ్మున్న వాడు కనుకనే న్యాయ రాజధాని రాయలసీమలో పెడతా అంటున్నాడు.  ప్రతి రోజూ నీ పచ్చ పత్రికల ద్వారా  జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసిన కరువు ప్రాంత ఆక్రందనలని అర్ధం చేసుకొన్న వ్యక్తిగా రాష్ట్ర అభివృద్దే ద్వేయంగా ముందుకెళ్తున్నాడు అన్నారు.

                          ఆత్మగౌరవసభకు విచ్చేసిన రాయలసీమ ప్రజలు 
 


అనంతరం తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రసంగిస్తూ రాయలసీమ వాసుల మనోభావాలను గౌరవిస్తూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధాని రాయలసీమకు ప్రకటిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఒక ప్రాంతంలోనే 29 గ్రామాల పరిధిలో అభివృద్ధి మొత్తం కేంద్రీకరించాలని, లక్షల కోట్ల రూపాయలు నిధులు అక్కడే ఖర్చు చేసి వారి అనుయాయుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కొమ్ము కాసే విధంగా రాయలసీమలోనే పుట్టి పెరిగిన చంద్రబాబు నాయుడు వ్యవహరించడం కడు శోచనీయమని ఎంపీ గురుమూర్తి అన్నారు. దుష్టచతుష్టయం సహకారంతో రాష్ట్ర ప్రజల మెదళ్లలో విష బీజాలు నాటుతున్న చంద్రబాబుకి ఆయన కోటరీకి తిరుపతి ఆత్మగౌరవ మహాప్రదర్శన ఒక చెంపపెట్టు అని ఈ నాటి సభ ద్వారా తెలిసి వచ్చిందని చెప్పారు. రాయలసీమ ఇప్పటివరకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ కరువులతో కడుపు మాడ్చుకొన్నాం, మన బిడ్డలకు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూసాం నేడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సీమ అభివృద్ధికి బాటలు పడ్డాయి, మన బిడ్డలకి ఉద్యోగ కల్పన కోసం రాయలసీమ అభివృద్ధి కోసం ఎన్నో కంపెనీలు నెలకొల్పుతున్నారు. ఆ కోవలోనే తిరుపతికి ఐటీ కాన్సెప్ట్ సిటీ కూడా మంజూరు అయిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి మద్దతుగా పెద్దఎత్తున తరలి వచ్చిన అశేష జనవాహినికి పాదాభి వందనం అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.



Wednesday, October 5, 2022

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

తిరుమల ఈ రోజు  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
అంతకుముందు తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.
          ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.
         ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం  చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
         తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై - లోకం క్షేమంగా ఉండడానికి, భక్తులు సుఖశాంతులతో ఉండడానికి- చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక - యజ్ఞాంతంలో అవభృథస్నానం' చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్ని సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం.
         చక్రస్నానం (అవభృథం)లో శ్రీవారి సుదర్శనచక్రానికి (చక్రత్తాళ్వార్‌కు) పుష్కరిణిలో స్నానం నిర్వహించే ముందు శ్రీభూ సమేత మలయప్పస్వామికి 'స్నపన తిరుమంజనం' నిర్వహించారు. తర్వాత సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణి జలంలో ముంచి, స్నానం చేయించారు. ఆ దివ్యాయుధ స్పర్శవల్ల  పవిత్రమైన పుష్కరిణి జలంలో భక్తసమూహం కూడా అదే సమయంలో స్నానం చేశారు. ఇందువల్ల ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికి దర్శించిన వారికి ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.
        సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి.ర‌మ‌ణ దంప‌తులు, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ శ్రీ‌ ర‌విరంజ‌న్‌, పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ మ‌ధుసూద‌న్ యాద‌వ్‌, ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, చెన్నై స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, జెఈవోలు శ్రీమ‌తి స‌దాభార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబీసీ సిఈవో శ్రీ ష‌ణ్ముఖ్ కుమార్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ప‌లువురు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tuesday, October 4, 2022

విజయదశమి అంటే ఏమి 🚩


దసరా పండుగ ఆవిర్భావ విశేషాలు 🚩🙏💐

చెడు మీద మంచిని సాధించిన విజయానికి_
గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు.

మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర,
మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణుజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించు కునుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన
మార్గం ఈ శరన్నవరాత్రులు*/*

దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు.
ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది.

చరిత్ర చెబుతున్నదేమిటి..

విజయదశమి రోజున చరిత్ర ప్రకారం
రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక        పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై
తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు.

ఈ సందర్భమున రావణ వధ,
జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం.
జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు.

మహిషాసురుడిని వధించిన అమ్మవారుఅమ్మవారు,

బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన         మహిషాసురుడు దేవతలతో ఘోరమైన
యుద్దం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు.

దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా          మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని
ప్రకాశవంతమైన తేజముగా మారింది.

త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై
ఒక స్త్రీరూపమై జన్మించింది.
శివుని తేజము ముఖముగా,
విష్ణు తేజము బాహువులుగా,
బ్రహ్మ తేజము పాదములుగా కలిగి
మంగళమూర్తిగా అవతరించిన ఆమె
పదునేనమిది చేతులను కలిగి ఉంది.

ఆమెకు శివుడు శూలమును,
విష్ణువు చక్రమును,
ఇంద్రుడు వజ్రాయుధమును,
వరుణ దేవుడు పాశము,
బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు.

ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది"

మహిషాసురుని తరపున
యుద్దానికి వచ్చిన ఉదద్రుడు,
మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు,             బిడాలుడు మొదలైన వారిని సంహరించిన
తరువాత మహిషాసురునితో తలపడినది🙏

విజయదశమి రోజునే శమీ పూజ

ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహం            శత్రువులను చీల్చి చెండాడింది.

దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవ రూపముతో భీకరముగా పోరు. చివరకు మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.

ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలవబడింది.
అదే విజయదశమి కూడా 🙏💐🌹🚩
విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు.

శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం కుటీరం
జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు.

శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది.

పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు         తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది.

సామాన్యులే గాక యోగులు..
నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు.🙏
ఆలయాలలో అమ్మవారికి విశేష
అలంకరణలు చేసి పూజిస్తారు 🙏🚩🌹💐

ఓం శ్రీ మాత్రే నమః 🙏🚩

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి దర్శనం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి శ్రీవారి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వర్ణ అశ్వ వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి శ్రీవారి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వర్ణ అశ్వ వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించారు. https://t.co/wzNRf2SkRrశ్రీవారి

వాల్టా... ఉల్టా

 చెట్టును నరికివేతో కరువుగా మారుతున్నా షోచమైన గాలి . అనుమతి లేకుండా ఒక్క చెట్టును కూడా నరకకూడదు. చెట్టును నరకాలంటే దానికి అధికార...